ఇటీవల విడుదలైన కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది. ‘మహా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి హిట్ చిత్రాల్ని తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం అన్ని తమిళనాడులో ఏరియాల్లోనూ, అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తో రూ.160 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. 9 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ కు ఓ సాలిడ్ హిట్ ను అందించింది.
ఇది ఆయన మార్క్ మూవీ కాదు. ఆయన మార్క్ రొమాన్స్, ముద్దు సీన్లు వంటివి ఇందులో ఉండవు. కంటెంట్ మీద వెళ్లే సినిమా కాదు. పూర్తిగా యాక్షన్ బేస్డ్ మూవీ ఇది. 67 ఏళ్ల వయసులో కూడా కమల్ హాసన్ అద్భుతంగా ఫైట్లు వంటివి చేయగలరు అని ఈ చిత్రం నిరూపించింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు గాను కమల్ హాసన్ చాలా సంతోషంగా ఉన్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ..
తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఈ చిత్రం నిరూపించింది. ‘రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’ బ్యానర్ పై స్వయంగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ‘విక్రమ్’ కు భారీ లాభాలు దక్కడంతో ఆయన దర్శకుడు లోకేష్ కు నిన్న లెక్సస్(Lexus) కంపెనీ బ్రాండ్ కారుని కమల్ బహుకరించిన సంగతి తెలిసిందే.దీని విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందట. ఇక ఈ చిత్రంలో రోలెక్స్ అనే టెరిఫిక్ పాత్రని పోషించాడు సూర్య.
ఆ పాత్రకి థియేటర్లలో మామూలుగా విజిల్స్ పడడం లేదు. డ్రగ్ మాఫియా డాన్(సిండికేటర్) గా అతను కనిపిస్తాడు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన పాత్రని పోషించినందుకు కమల్ సూర్యకి రోలెక్స్ వాచ్ ను బహుకరించారు. సినిమాలో సూర్య పాత్ర పేరు కూడా రోలెక్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వాచ్ ధర రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక ‘విక్రమ్’ చిత్రం రూ.200 కోట్ల దిశగా దూసుకుపోతుంది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!