రియాలిటీ షోకి దూరంగా కమల్!

  • March 23, 2021 / 03:31 PM IST

బిగ్ బాస్ రియాలిటీ షోకి ఇండియాలో క్రేజ్ పెరిగింది. ముందుగా బాలీవుడ్ లో మొదలైన ఈ షో.. సౌత్ కి కూడా పాకింది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులో వరుసగా మూడు సీజన్లలో ముగ్గురు హోస్ట్ లను చూశాం. కన్నడలో సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు మాత్రం మొదటినుండి ఈ షోలను నడిపిస్తున్నారు. అయితే తమిళ ప్రేక్షకులు తరువాతి సీజన్లలో హోస్ట్ గా కమల్ ని చూడలేరనేది తాజాగా సమాచారం.

ప్రస్తుతం కమల్ రాజీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ తరువాత ‘విక్రమ్’, ‘ఇండియన్ 2’ లాంటి సినిమాలను పూర్తి చేయాల్సివుంది. ఆ తరువాత పార్టీ బాధ్యతలు కూడా చూడాల్సివుంది. గతంలో కమల్ ఓ ఇంటర్వ్యూలో.. తాను బిగ్ బాస్ షో మీద ఆసక్తితో హోస్ట్ చేయడం లేదని.. పార్టీ నడపడానికి కావాల్సిన నిధుల కోసం ఈ షోని హోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపై కమల్ కి బిగ్ బాస్ షోలో పాల్గొనే ఉద్దేశాలు లేవని కోలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది. కమల్ స్థానంలో కోలీవుడ్ హీరో శింబు రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే శింబులో హోస్ట్ కి కావాల్సిన లక్షణాలు లేవని.. వ్యక్తిగతంగా కూడా అతడి సరైన ఇమేజ్ లేదని కొందరు వాదిస్తున్నారు. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉండే ఈ హీరో కమల్ స్టేచర్ ని ఎంతవరకు మ్యాచ్ చేయగలడనే సందేహాలు తలెత్తుతున్నాయి. శింబుని గనుక షోలో తీసుకుంటే చాలా మంది వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. మరి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus