Kamal Hassan: తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలను ఆదరిస్తారు: కమల్

  • June 8, 2022 / 12:15 PM IST

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల అయ్యి విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ వంటి పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదటి షో తో నుంచి అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ముఖ్యంగా ఇందులో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పాత్రలు హైలెట్ అయ్యాయి.

ఇక చివరి ఐదు నిమిషాల క్లైమాక్స్ సన్నివేశాలలో స్పెషల్ రోల్ లో సందడి చేసిన సూర్య పాత్ర సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఈ విధంగా సూర్య ఎంట్రీతో ఖైదీ సీక్వెల్ సినిమాకి దర్శకుడు హింట్ ఇచ్చారు.ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం కావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక సీక్వెల్ సినిమా గురించి కమల్ హాసన్ స్పందిస్తూ పరోక్షంగా విక్రమ్ సినిమా సీక్వెల్ ఉంటుందని వెల్లడించినప్పటికి తాజాగా మరోసారి ఈ సినిమా సీక్వెల్ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు.విక్రమ్ సినిమాని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఉంటుందని కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాలను ఆదరిస్తారు.అదే విధంగా మంచి ఆర్టిస్టులకు సపోర్ట్ గా ఉంటూ వారి సినిమాలను ఆదరిస్తారని, ఇప్పుడు విక్రమ్ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించింది అంటూ ఈ సందర్భంగా కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఇక ఈ సినిమాలో సూర్య పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని ఈ క్రమంలోనే తరువాత చిత్రంలో మేమిద్దరం కలిసి నటించబోతున్నామని కమల్ హాసన్ తెలిపారు. మొత్తానికి విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం కూడా రానున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus