కష్టాల్లో ఉన్నాం… కనికరించింది అంటూ ట్విటర్ వేదికగా ఇలా ట్వీట్ చేస్తే… అలా ఆపన్నహస్తం అందిస్తుంటారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఆయన సాయం అందుకున్న వారు చాలామందే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సినిమా పాటల రచయిత కందికొండకు కూడా సాయం చేశారు. అయితే ఆయన తనయ మాతృక ఇటీవల మరోమారు కేటీఆర్ సాయం కోరారు. దానికి కేటీఆర్ కూడా స్పందించారు. తన కార్యాలయం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ కార్యాలయం ఈ విషయంలో మీకు సహకారం అందిస్తామని ట్వీట్ చేశారు.
కందికొండ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కుమార్తె మాతృక తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ మోతీనగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నామని చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చొరవ చూపాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జూన్‌లో కందికొండ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి కేటీఆర్ సాయం చేశారు. ఆయన కిమ్స్‌లో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు పరిస్థితి స్వయంగా తెలుసుకుని కేటీఆర్ చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఆర్థికంగానూ అండగా నిలిచారు. దాదాపు 40రోజుల పాటు వైద్యులు కందికొండకు ప్రత్యేకంగా చికిత్స అందించారు.
ఇదంతా కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించడం వల్లే ఇది సాధ్యమైందని మాతృక తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం కందికొండ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చూడాలని మాతృక కేటీఆర్‌ను కోరారు. చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు కోసం కందికొండ ₹4.05లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారట. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కారణంగా మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోయారగ. దీంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారట. ఈ నెల తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని ఆదేశించిన నేపథ్యంలో మాతృక… ఇలా కేటీఆర్ దృష్టికి విషయం తీసుకెళ్లారు.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!