Kangana Ranaut: ఇందిరా గాంధీని ఆఫీసులో సర్‌ అని పిలిచేవారా?

  • July 15, 2022 / 12:54 PM IST

దేశంలో చీకటి రోజులు అంటూ ‘ఎమర్జెన్సీ’ గురించి చెబుతుంటారు మన రాజకీయ నాయకులు, పెద్దలు. ఇప్పటితరానికి తెలియదు కానీ.. ఆ రోజులు మాత్రం పగోడికి కూడా రాకూడదు అని చెబుతుంటారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలో ఆ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం రోజులు, వ్యవహారాన్ని సినిమాగా తీసుకొస్తోంది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌. ఇటీవల ‘ధాకడ్‌’తో గట్టి దెబ్బ తిన్న కంగనా.. ఇప్పుడు పొలిటికల్‌ హీట్‌ పెంచే పనిలో పడింది.

‘ఎమర్జెన్సీ’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాను కంగననానే డైరెక్ట్‌ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు కంగనా ట్వీట్ చేసింది. దాంతోపాటు సినిమా ఫస్ట్ లుక్‌తో గ్లింప్స్‌తోపాటు టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందిరా గాంధీ లుక్‌లో కంగనా రనౌత్‌ అదిరిపోయింది అని చెప్పాలి. ఇందిర యాటిట్యూడ్‌, మేనరిజమ్స్‌, పెదాలను కదపడం.. ఇలా చాలా విషయాల్లో కంగనా.. ఇందిరను పోలి ఉంది అనిపిస్తోంది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమె సపోర్టర్స్‌ తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక టీజర్‌ వీడియో విషయానికొస్తే… ‘‘అమెరికా ప్రెసిడెంట్‌కి చెప్పండి. నా ఆఫీసులో అందరూ నన్ను మేడమ్ కాదు సర్ అని పిలుస్తారని’’ అనే డైలాగ్‌ అదిరిపోయింది. ఈ సినిమాను సొంత నిర్మాణ సంస్థలోనే కంగన ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఆమె కెరీర్‌లో ఇది రెండో డైరక్టోరియల్‌ ఫిల్మ్‌. ‘మణికర్ణిక’ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్‌ను పక్కన పెట్టి తనే దర్శకత్వం వహించింది. ఇప్పుడు ఫుల్‌ మూవీని ఆమే చేయబోతోంది.

ఇక్కడి వరకు అంతా బాగుంది… అయితే బహిరంగంగానే బీజేపీకి సపోర్టు చేసే కంగనా రనౌత్‌.. ఇప్పుడు ‘ఎమర్జెన్సీ’ టైమ్‌లో జరిగింది జరిగినట్లు చూపిస్తుందా అనేది ప్రశ్నగా మారింది. కాంగ్రెస్‌ పార్టీని, గత ప్రభుత్వాల్ని ఆమె అవకాశం వచ్చినప్పుడల్లా ఏకిపారేస్తూ ఉంటుంది. దేశంలో ఎమర్జెన్సీ రోజుల్ని చీకటి రోజులు అని కచ్చితంగా చెప్పొచ్చు. అయితే వాటిని కంగనా అలానే చూపిస్తుందా లేక కాస్త ఫ్లేవర్‌ యాడ్‌ చేస్తుందా అనేది చూడాలి. ఏమన్నా తేడా కొడితే రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus