ఆ స్టార్ హీరోల పేర్లు బయటపెట్టి.. వారి పరువు తీసేసిన కంగనా..!
September 4, 2020 / 11:05 AM IST
|Follow Us
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా… అక్కడి స్టార్లకు నిద్రలేకుండా చేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలో.. అక్కడ నెపోటిజం ఉందంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్న కంగనా.. తాప్సి మరియు కంగనా వంటి హీరోయిన్లను ‘బి గ్రేడ్ హీరోయిన్లు’ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తాజాగా… కరణ్ జోహార్, హృతిక్ రోషన్ వంటి స్టార్ల పై కూడా కంగనా ఎన్నో ఆరోపణలు చేసింది.
ఇప్పుడు డ్రగ్స్ ఇష్యూ పై కూడా రోజుకో కామెంట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా నలుగురు బాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు రివీల్ చేసి వారి పరువు తీసేసింది ఈ బ్యూటీ.’రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ వంటి స్టార్ హీరోలు డ్రగ్స్ తీసుకుంటారని.. బాలీవుడ్ మొత్తానికి తెలుసు. కొకైన్ బానిసలు అని ముద్రపడిన ఈ నలుగురు స్టార్ హీరోలు.. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి.
ఆ టెస్ట్ చేయించుకుని వారి పై వస్తోన్న ఆరోపణలకు చెక్ పెట్టాలని’ ఆమె ఇటీవల ట్వీట్ చేసింది. ఏకంగా ఈ ట్వీట్లో ప్రధానమంత్రి కార్యాలయాన్నే ట్యాగ్ చేసింది ఈ బ్యూటీ. ‘నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్.సి.బి) కనుక సీరియస్ గా విచారణ చేపడితే..ఇంకా చాలా మంది బాలీవుడ్ హీరోలు అడ్డంగా బుక్కవుతారు’.. అంటూ ఈమె చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి.