Kangana Ranaut: అగ్నిపథ్ పథకానికి మద్దతు తెలిపిన కంగనా.. పోస్ట్ వైరల్!
June 20, 2022 / 07:13 PM IST
|Follow Us
భారత సైన్యాన్ని మరింత కట్టుదిట్టం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం ద్వారా ఆసక్తి కలిగిన యువత సైన్యంలో చేరవచ్చని నాలుగు సంవత్సరాల తర్వాత 25 శాతం మందిని వారి నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేసి వారిని శాశ్వతంగా సైన్యంలోకి తీసుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేయగా మరికొందరు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టారు.
ఈ క్రమంలోని ఈ పథకానికి వ్యతిరేకంగా కొందరు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ లను ధ్వంసం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కాంట్రవర్సి బ్యూటీ కంగనా రనౌత్ ఈ విషయంపై స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేస్తూ ముందుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన అగ్నిపథ్ వంటి పథకాన్ని ప్రవేశపెట్టిన అందుకు ఈమె కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.ఇప్పటికే ఎన్నో దేశాలలో ఈ పథకం అమలు అవుతూ సైన్యాన్ని పటిష్టం చేస్తోంది అంటూ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎంతో మంది యువత జీవితంలో ఎలా విలువలతో జీవించాలో నేర్చుకుంటుంది అంటూ తెలిపారు. ఈ పథకంలోకి చేరితే ప్రతి ఒక్కరిలోనూ క్రమశిక్షణ జాతీయ భావం, సరిహద్దు ప్రాంతాలలో ఉన్న దేశాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుస్తోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన ఈ పథకంలో చాలా లోతైన అర్థం దాగి ఉంది. ఈ పథకాన్ని ఎవరి స్వార్థం కోసం డబ్బు సంపాదించడం కోసం తీసుకురాలేదు. పూర్వంలో కూడా ఎంతోమంది పలు విషయాలను నేర్చుకోవడం కోసం గురుకులాలకు వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతం ఇది కూడా అదేనని కంగనా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ వంటి పథకాన్ని సాంప్రదాయ గురుకులాలతో పోల్చడం గమనార్హం.ఇలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఈమే చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.