Akhil: అఖిల్ మూవీలో ఆ స్టార్ హీరోకి ఛాన్స్..!

  • June 8, 2021 / 04:27 PM IST

అక్కినేని అఖిల్ ఓ హిట్ అందుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. చేసిన 3 సినిమాలు పర్వాలేదు అనిపించినా.. అవి లాంగ్ రన్ లో ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అఖిల్ చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం హిట్ అయితే చాలు అన్నట్టు ఉంది పరిస్థితి. అక్కినేని అభిమానులు కూడా ఈ చిత్రం పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ‘కొడుతున్నాము’ అంటూ ప్రతీ ప్రీ రిలీజ్ వేడుకలో అఖిల్ చెప్పడం.. అవి మిస్ ఫైర్ అవ్వడంతో అభిమానులు కూడా నమ్మకం పెట్టుకోవడం మానేశారు.

అయితే సురేందర్ రెడ్డితో.. అఖిల్ సినిమా అని ప్రకటించగానే అక్కినేని అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ‘ఏజెంట్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో అఖిల్ పుంజుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇక నిర్మాత అనిల్ సుంకర ఖర్చుకి వెనుకాడే వ్యక్తి కాదు. కాబట్టి.. ఈ చిత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది అంటూ ముందు నుండీ ఊహాగానాలు వినిపించాయి.

అందుకు తగినట్టుగానే ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ ఉండబోతుంది అని స్పష్టమవుతుంది. ఇందులో భాగంగా విలన్ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను ఎంపిక చేసుకున్నట్టు తాజా సమాచారం. ఈ ప్రాజెక్టు చేయడానికి ఉపేంద్ర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ప్రస్తుతం ఆయన వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గని’ సినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus