Kantara OTT: అక్కడ ఎపిక్ బ్లాక్ బస్టర్.. ఇక్కడ కాదట..!
November 30, 2022 / 05:53 PM IST
|Follow Us
కన్నడ సినిమాలు ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించాయి. ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే అందరూ కొంత చిన్న చూపు చూసేవారు. ఎందుకంటే అక్కడి మేకర్స్ కూడా ఎక్కువగా రీమేక్ లపైనే ఫోకస్ పెట్టేవారు. అందులో ఎక్కువగా మన సినిమాలే ఉండేవి. ఏ సినిమానైనా వాళ్ళు రీమేక్ చేయాలి అనుకుంటే రైట్స్ కొనుగోలు చేసుకోనవసరం లేదు. అందుకే వాళ్ళు రీమేక్ చేసుకునే వారు. పైగా వాటిని మళ్ళీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేవారు.
అందుకే కన్నడ సినిమాల పై చాలా మందికి అలాంటి నెగిటివ్ ఒపీనియన్ ఉండేది. అయితే కే.జి.ఎఫ్ చిత్రం కన్నడ చిత్ర రూపురేకల్ని మార్చేసింది. ఆ తర్వాత కాంతార కూడా దానిని కంటిన్యూ చేస్తూ.. తెలుగు బయ్యర్లకు భారీ లాభాలను అందించింది. ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే.. కే.జి.ఎఫ్ కంటే ఎక్కువ లాభాలను అందించింది ఈ మూవీ. అయితే ఓటీటీలో ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది అని చెప్పాలి. సినిమా చూసిన ప్రేక్షకులు ఇదేం సినిమా..
ఇది హిట్టేంటి.. అంటూ పెదవి విరుస్తున్నారు. నిజానికి కాంతార అనేది ధియేటర్ లలో చూడాల్సిన మూవీ. సినిమా స్టార్టింగ్ 15 నిమిషాలు, చివరి 30 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్ .. ఆ మూడ్ ను క్రియేట్ చేస్తాయి. కానీ ఓటీటీలో పాస్ లు, ఫాస్ట్ ఫార్వర్డ్ లు పెట్టుకుని చూస్తే నచ్చే సినిమా కాదు. అందుకే ధియేటర్ లలో చూడాల్సిన సినిమాలు థియేటర్లలోనే.. చూడాలి.
ఓటీటీ జనాలకు ఈ సినిమా నచ్చకపోయినా వ్యూయర్ షిప్ బాగానే నమోదవుతుంది. కాంతార అనే కాదు థియేటర్లో రిలీజ్ సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలకు ఓటీటీలో ఇలానే మిశ్రమ స్పందన రావడం మనం చూశాం.