Kantara Collections: 13వ రోజు కూడా బాగా రాణించిన ‘కాంతార’..!
October 28, 2022 / 08:29 PM IST
|Follow Us
కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు రేటింగ్ లు ఇచ్చారు.
మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ కుమ్మేస్తుంది అని చెప్పాలి. ఆ జోరు ఇప్పటికీ తగ్గలేదు. 13వ రోజు కూడా ఈ మూవీ అనుకున్నదానికంటే బాగా కలెక్ట్ చేసింది.ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
7.52 cr
సీడెడ్
2.08 cr
ఉత్తరాంధ్ర
2.20 cr
ఈస్ట్
1.34 cr
వెస్ట్
0.87 cr
గుంటూరు
1.09 cr
కృష్ణా
1.10 cr
నెల్లూరు
0.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
16.88 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.19 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
17.07 cr (షేర్)
‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.17.07 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.15.07 కోట్ల భారీ లాభాలను అందించింది.
నిన్న కూడా ఈ మూవీ రూ.0.48 కోట్ల పైనే షేర్ ను అందించింది. ఈ వీకెండ్ కు కూడా పెద్దగా పేరున్న సినిమాలు లేవు కాబట్టి.. మరింతగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.