Kantara TRP: ‘కె.జి.ఎఫ్’ కంటే ‘కాంతార’ కి ఎక్కువ… టీవీల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కాంతార’
February 2, 2023 / 03:34 PM IST
|Follow Us
2022 లో తెలుగులోకి డబ్ అయ్యి రిలీజ్ అయిన కొన్ని కన్నడ సినిమాలు బాగా ఆడాయి. అందులో ‘కాంతార’ సినిమా ఒకటి. ఈ మూవీ అయితే భారీ లాభాలను అందించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తెలుగులో ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా లాభాలను అందించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘కె.జి.ఎఫ్'(సిరీస్) నిర్మాతలు అయిన ‘హోంబలే ఫిలింస్’ వారు నిర్మించారు.
కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. బాలీవుడ్లో కూడా ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. భూత కోలా అనే ఎపిసోడ్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. అందుకే తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూశారు ప్రేక్షకులు.
అయితే థియేటర్లలో హిట్ అయిన సినిమాలకు ఓటీటీల్లో సరైన రెస్పాన్స్ రావడం లేదు. ‘కాంతార’ విషయంలో కూడా అదే జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని వీక్షించిన కొందరు ప్రేక్షకులు ఇదే సినిమా అని నెత్తి కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బుల్లితెర పై ప్రసరమైనప్పుడు ఈ సినిమాకి మినిమమ్ టి.ఆర్.పి రేటింగ్ అయినా వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ‘కాంతార’ చిత్రం మొదటి సారి స్టార్ మా లో టెలికాస్ట్ అయినప్పుడు 14.6 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
‘కె.జి.ఎఫ్’ రెండు పార్టులు మొదటి సారి టెలికాస్ట్ అయినప్పటి కంటే కూడా ‘కాంతార’ టి.ఆర్.పి రేటింగ్ ఎక్కువ. ‘కాంతార’ శాటిలైట్ హక్కులను స్టార్ మా వారు రూ.4.5 కోట్లకు కొనుగోలు చేశారు. జనవరి 22న ఈ ‘కాంతార'(తెలుగు) టెలివిజన్ ప్రీమియర్ ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో మొదటిసారికే వాళ్ళు లాభాల బాట పట్టినట్టు వినికిడి.