Kantara OTT: ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ గురించి నెట్టింట చర్చలు.. మేకర్స్ ఏం చేశారంటే..!
November 24, 2022 / 04:25 PM IST
|Follow Us
ఏదైనా మంచి పాజిటివ్ బజ్ ఉన్న సినిమా రిలీజ్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో.. ఆ రేంజ్లో ‘కాంతార’ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేశారు ఆడియన్స్.. వారి ఎదురు చూపులకు తెర దించుతూ.. నవంబర్ 24 మిడ్ నైట్ (12 గంటలు) నుండి అమెజాన్ ప్రైమ్‌లో.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్కిది గుడ్ న్యూసే. కట్ చేస్తే ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ అందరికీ షాకిచ్చింది..
ఓటీటీ రిలీజ్ అనౌన్స్ మెంట్ వచ్చినా, 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయినా కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతూనే ఉంది ‘కాంతార’.. కంటెంట్ కొత్తగా ఉంటే.. సౌత్ ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా సినిమాలని ఆదరిస్తారు అనే మాట మరోసారి నిజమని నిరూపించింది రీసెంట్ సెన్సేషన్ ‘కాంతార’.. రిషబ్ శెట్టి నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘కాంతార’ ఇప్పటి వరకు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ప్రపంచమంతా పూనకం వచ్చినట్టు ‘కాంతార’ జపం చేసేలా చేశాడు రిషబ్.. బాక్సాఫీస్ దగ్గర జాతర వాతావరణం తీసుకొచ్చాడు..
వివరాల్లోకి వెళ్తే.. ‘కాంతార’ లో ‘వరాహ రూపం’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. సినిమాకి సోల్ ఈ పాటే.. ఓటీటీ వెర్షన్లో ‘వరాహ రూపం’ సాంగ్ రిమూవ్ చేసేశారు. దీనికి కారణం కాపీ రైట్ ఇష్యూ.. ఐదేళ్ల క్రితమే కన్నడలో ‘వరాహ రూపం’ ఒరిజినల్ బీట్ ఉండడంతో.. కాపీ ఆరోపణల నేపథ్యంలో మూవీకి సోల్ అయిన ఈ సాంగ్ తీసేశారు మేకర్స్. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. దీనికంటే థియేటర్ ఎక్స్‌పీరియన్సే బెటర్ అంటూ రకరకాల మీమ్స్‌తో పాటు #BringBackVarahaRoopam అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది..
ఇక కన్నడ సినిమా చరిత్రలో ఇప్పటివరకు హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన ‘కె.జి.యఫ్’ రికార్డుని బీట్ చేయడానికి అతి చేరువలో ఉంది ‘కాంతార’.. ఇప్పటివరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న ‘కాంతార’ కొద్దిరోజుల్లో శాండల్ వుడ్లో నంబర్ వన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనుంది. ఇంకో హైలెట్ ఏంటంటే నార్త్‌లో రూ. 100 కోట్లకు దగ్గర్లో ఉంది.. ‘కాంతార’ ఈ రేంజ్ వసూళ్ల తెస్తుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా బాలీవుడ్ బడా బాబులు అయితే ఈ కలెక్షన్లు చూసి షాక్ తిన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మార్క్ టచ్ చేసింది ‘కాంతార’..