Karan Johar: బాలీవుడ్‌ సినిమాలపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • December 12, 2022 / 12:56 PM IST

కరోనా – లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో చాలా మార్పులు వచ్చాయి. మనుషుల జీవన విధానంలోనూ మార్పులొచ్చాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి, ఏం వచ్చాయి అనేది మనందరికీ తెలుసు. వీటితోపాటు ఇలాంటి భారీ మార్పు వచ్చిన మరో అంశం బాలీవుడ్‌. అప్పటివరకు దేశంలో నెంబర్‌ వన్‌ అనుకున్న హిందీ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి వెళ్లింది. ఎలాంటి సినిమా చేసినా విజయం రావడం లేదు. తిరిగి నానా ఇబ్బందులు వస్తున్నాయి. తాజాగా ఇదే పరిస్థితిపై ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి కూడా.

గత కొన్ని నెలలుగా చూసుకుంటే బాలీవుడ్ సినిమాల వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు దేశవ్యాప్తంగా బాగానే అడుతున్నాయి.ఆ స్థాయికి సరితూగే బాలీవుడ్‌ సినిమా రావడం లేదు. అయితే బాలీవుడ్ ఈ పరిస్థితికి రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి అంటారు పరిశ్రమ పరిశీలకులు. అలా కరణ్‌ జోహార్‌ కూడా ఈ పరిస్థితిపై కామెంట్స్‌ చేశారు. హిందీ సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతల్లో గట్స్ తగ్గాయి. అందుకే బాలీవుడ్‌కి ఈ పరిస్థితి అని ఘాటుగా కామెంట్స్‌ చేశారాయన.

బాలీవుడ్‌లో ఒకప్పుడు ఒరిజినల్ కంటెంట్ సృష్టించేది. ఆ దమ్మున్న వాళ్లు అప్పుడు బాలీవుడ్‌లో ఉండేవారు. కానీ ఇప్పుడు అదే లోపించింది. దాంతో శాపంగా మారింది. అని స్ట్రాంగ్‌గా కామెంట్స్‌ చేశారు కరణ్‌ జోహార్‌. తెలుగు, తమిళ సినిమాల రీమేక్‌ల వెంట ఇప్పుడు బాలీవుడ్‌ జనాలు పడుతున్నారు. దీంతో అక్కడే బాలీవుడ్‌ పతనం మొదలైంది అని కరణ్‌ అన్నారు.

సౌత్‌ ఇండస్ట్రీలో విజయం అందుకున్న ప్రతి సినిమా హక్కులు కొనడం, వాటిని హిందీలో తీయడం ఎక్కువైంది. దీంతో సొంత ఆలోచనలు, సొంత కథలు గురించి ఇక్కడివాళ్లు ఆలోచించడం మానేశారు అని కరణ్‌ జోహార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఓసారి ఇలాంటి కామెంట్సే చేశారాయన. అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మరిప్పుడైనా పట్టించుకుంటారేమో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus