ఇప్పుడు రన్ టైమ్ తగ్గించి ఏం లాభం చెప్పండి

  • February 16, 2019 / 06:09 PM IST

సినిమా బాగుంటే సీన్లు యాడ్ చేయడం, బాగోకపోతే ట్రిమ్ చేయడం అనేది చాలా రెగ్యులర్ గా జరిగే విషయం. ఇప్పుడు కార్తీ-రకుల్ ప్రీత్ సింగ్ ల తాజా చిత్రానికి కూడా అదే తరహా ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు. వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన “దేవ్”కి తెలుగులోనే కాక తమిళంలో విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో మొదటిరోజే ఫ్లాప్ సినిమాగా డిక్లేర్ చేసిపాడేశారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాలేదు. ఇక తమిళనాట మొదటి రెండు రోజులు సోసోగా ఆడిన ఈ చిత్రం మూడోరోజు చతికిలపడింది.

దాంతో సినిమాకి ఎలాగైనా జనాల్ని రప్పించడం కోసం దర్శకనిర్మాతలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ముందుగా సినిమాకి పెద్ద మైనస్ అయిన రన్ టైమ్ ను ట్రిమ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు తొలగించారు. అయితే.. సినిమాకి అసలు కథ లేకపోవడమే పెద్ద మైనస్.. అలాంటిది ఎన్ని జిమ్మీక్కులు చేస్తే మాత్రం సినిమా హిట్ అవుతుందా చెప్పండి. అసలే తెలుగులో అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న రకుల్ కి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం మరో మైనస్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus