Karthi: ‘విక్రమ్’ రిజల్ట్ తో కార్తీ కాన్ఫిడెన్స్ పెరిగింది!
June 8, 2022 / 10:09 AM IST
|Follow Us
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ… దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేసిన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదొక కల్ట్ క్లాసిక్ మూవీ అనిపించుకుంది. ఆ చిత్రంతో టాలీవుడ్లో చాలా మంది హీరోలు దర్శకుడు లోకేష్ తో సినిమాలు చేయాలని ఉన్నట్లు వెల్లడించారు. కాకపోతే లోకేష్… విజయ్ తో ‘మాస్టర్’ చేశారు. ఆ చిత్రానికి కొంత నెగిటివ్ రిపోర్ట్స్ వినిపించాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైలెంట్ అయిపోయారు.
అయితే ‘ఖైదీ’ సినిమా ఎండింగ్ లో ‘ఖైదీ 2’ కూడా ఉండబోతోందనే హింట్ ఇచ్చాడు లోకేష్. ప్రమోషన్స్ టైంలో ఆ విషయం పై కూడా ఆయన స్పందించారు. సీక్వెల్ కు కావల్సినంత స్కోప్ కూడా ఈ సినిమాలో ఉందని చెప్పుకొచ్చాడు. కాకపోతే.. ‘మాస్టర్’ విడుదల తర్వాత కార్తీ కొంచెం డౌట్ పడ్డాడు. ‘ ‘ఖైదీ’ వంటి హిట్ సినిమాకు సీక్వెల్ అంటే బోలెడన్ని అంచనాలు ఉంటాయి.. ఇప్పుడు నువ్వున్న బిజీ షెడ్యూల్ కు ‘ఖైదీ’ సీక్వెల్ చేయడం రిస్క్’ అని చెప్పి ఆ ప్రాజెక్టుని కార్తీ హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వినిపించాయి.
దీంతో ఇక ‘ఖైదీ’ సీక్వెల్ ఉండదని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు లోకేష్ కనగరాజ్. ‘విక్రమ్’ కథ పరంగా సో సో గానే ఉంటుంది. కాకపోతే లోకేష్ టేకింగ్… అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. కమల్, ఫహద్, విజయ్ సేతుపతి వంటి స్టార్లను లోకేష్ డీల్ చేసిన విధానం కూడా అందరినీ ఆకర్షించింది.
కాబట్టి కథ సో సోగా ఉన్నా లోకేష్ కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దగలడు అనే నమ్మకం కార్తీకి వచ్చింది. అందుకే ‘ఖైదీ’ సీక్వెల్ పై మరోసారి లోకేష్ ను పిలిచి డిస్కషన్లు మొదలుపెట్టాడు. లోకేష్ ప్రస్తుతం ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. కానీ నిర్మాతల వద్ద నుండి అతనికి అడ్వాన్స్ లు తెగ వస్తున్నాయి. కాబట్టి ఇదే క్రమంలో కార్తీ తో ‘ఖైదీ’ చేస్తే బాగుంటుంది అని.. అతను కూడా భావిస్తున్నాడు.