రొమ్యాంటిక్ టచ్ ఇస్తున్న కార్తీ!!!

  • February 7, 2017 / 06:37 AM IST

ఏ సినిమా పరిశ్రమంలో అయినా….రొమ్యాంటిక్ పాత్రలు చేయడానికి స్పెషల్ హీరోలు ఉంటారు….ఇప్పుడు మన టాలీవుడ్ లో చిన్న హీరోలు పక్కన పెడితే…..కింగ్ నాగ్ మంచి రొమ్యాంటిక్ హీరోగా మంచి స్టార్డమ్ ఏర్పరుచుకున్నాడు…..అయితే తమిళ ఇండస్ట్రీలో సూర్య తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అన్నకు తగ్గ తమ్ముడుగా, మంచి సినిమాల్లో అవకాలను ఉపయోగించుకుంటూ….సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు యువ హీరో కార్తి……అదే క్రమంలో….కాస్త మాస్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న కార్తి….ఇప్పుడు కాస్త రూట్ మార్చాడట…విషయంలోకి వెళితే…సగటు కుర్ర హీరోగా ఇప్పటివరకూ అలరించిన కార్తీ….ఈసారి కాస్త రొమాంటిక్ యాంగిల్ చూపించడానికి సిద్ధమయ్యాడట. కార్తి హీరోగా తెరకెక్కుతున్న సినిమా చెలియా మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

అయితే సినిమాలో కార్తి ఎప్పుడు లేని విధంగా తనలోని రొమాంటిక్ యాంగిల్ చూపించి రచ్చ రచ్చ చేశాడట. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ చెలియా సినిమాలో లిప్ లాక్ సీన్స్ చాలా ఉన్నాయట. సినిమాలో హీరోయిన్ అదితితో కార్తి ముద్దు సీనుల్లో ఇరగదీశాడని టాక్….అయితే ఇలాంటి సీన్స్ కార్తీకి కాస్త కొత్త కావడంతో మొదట కాస్త కంగారు పడినా సినిమా కోసం తప్పదని చేశాడట కార్తి. ఇక ఈ సినిమాని తెలుగులో మన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, దిల్ రాజు తీసుకున్నాడు….అసలే వరుస హిట్స్ తో సూపర్ ఫార్మ్ లో ఉన్నాడు రాజు…..ఇక ఈ సినిమా రిసల్ట్ కూడా దిల్ రాజు చేతిలో పడింది అంటే అర్ధం అయిపోతుంది. చూద్దాం మరి ఈ అదరచుంబనాల ఆట ఎలాంటి కిక్ ఇస్తుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus