సర్దార్ డైరెక్టర్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన నిర్మాత?
November 3, 2022 / 04:02 PM IST
|Follow Us
ఈ మధ్యకాలంలో ఒక సినిమా హిట్ అయితే చాలు హీరోలకు దర్శకులకు నిర్మాతలు పెద్ద ఎత్తున ఖరీదైన బహుమతులను కానుకలుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలోనే పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీక్ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం సర్దార్.వాటర్ మాఫియా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో అద్భుతమైన విషయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కార్తీక్ తండ్రి కొడుకు పాత్రలలో సందడి చేశారు.
ఇలా విభిన్న కథాంశాల ద్వారా కార్తి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మధ్యకాలంలో వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక సర్దార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో నిర్మాతలు భారీ లాభాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాత దర్శకుడికి ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చారని తెలుస్తోంది. సర్దార్ చిత్ర నిర్మాత ప్రిన్స్ పిక్చర్ అధినేత ఎస్ లక్ష్మణ్ కుమార్ దర్శకుడు పి ఎస్ మిత్రన్ కి రెండు కోట్ల రూపాయల విలువచేసే కారును కార్తి చేతుల మీదుగా అందించారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక డైరెక్టర్ పిఎస్ మిత్రన్ కారును బహుమానంగా అందుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తూ నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇకపోతే సర్దార్ సినిమాని కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే మొదటి భాగం మంచి విజయాన్ని అందుకోగా త్వరలోనే రెండవ భాగంపై దర్శకుడు కసరత్తుల మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.