రియల్ హీరో అంటూ టీడీపీ నేతపై డాక్టర్ బాబు కామెంట్స్.. వైరల్ అవుతున్న ఫోటో!

  • January 23, 2023 / 12:53 PM IST

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన సొంత పేరుతో చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తుకొస్తారు. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ పాత్రలో నటించిన ఈయన డాక్టర్ బాబుగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో పేరు సంపాదించుకున్న నిరుపమ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈయన తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే డాక్టర్ బాబు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ తోకలిసి డాక్టర్ బాబు ఫోటోలు దిగారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అనుకోకుండా పరిటాల శ్రీరామ్ గారిని కలవడం సంతోషంగా ఉంది అంటూ తనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ డాక్టర్ బాబు రియల్ హీరో పరిటాల శ్రీరామ్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఫోటో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చిచ్చు రేపింది. కొందరు ఈ ఫోటో పై స్పందిస్తూ పరిటాల శ్రీరామ్ రియల్ హీరో ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ బాబు పరిటాల శ్రీరామ్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus