వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్నా సరే.. ‘మాకెందుకు’ అని ఇంట్లో లేడీస్ రిమోట్ లాగేసుకుని మరీ దాచుకుంటున్నారు అంటే అది కచ్చితంగా ‘కార్తీక దీపం’ సీరియల్ వల్లే అనడంలో అతిశయోక్తి కాదు.ఈ సీరియల్ వల్లే ‘స్టార్ మా’ వారు టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. స్టార్ హీరో సినిమాలను టెలికాస్ట్ చేసినా.. రాని రేటింగ్ ‘కార్తీక దీపం’ సీరియల్ కు వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. అంతలా ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి కారణం.. వంటలక్క అలియాస్ దీప పాత్ర వల్లే అని చెప్పాలి.
ఈ పాత్రను పోషించింది మలయాళ నటి ప్రేమీ విశ్వనాథ్. పెద్దగా గ్లామర్ లేకపోయినా.. ఎవ్వరూ సాధించలేని క్రేజ్ ను అలాగే పారితోషికాన్ని ఈమె సంపాదించుకుంటుంది. నిజానికి ‘కార్తీక దీపం’ సీరియల్ ఓ మలయాళ సీరియల్ కు రీమేక్. ‘కారుముత్తు’ అనే సీరియల్ ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు. అక్కడ కూడా ప్రేమీ విశ్వనాథే టైటిల్ రోల్ పోషించింది. అక్కడ ఒక్కో ఎపిసోడ్ కు రూ15వేల నుండీ రూ20వేల వరకూ ఈమె అందుకునేదట. అయితే తెలుగులో మాత్రం రూ75 వేల నుండీ 1లక్ష వరకూ అందుకుంటూ వస్తుందని తెలుస్తుంది.
ఇక లాక్ డౌన్ కారణంగా 2 నెలలకు పైనే షూటింగ్ నిలిచిపోయింది.దాంతో ఈ సీరియల్ రీ టెలికాస్ట్ చేస్తున్నారు.కానీ కొత్త ఎపిసోడ్ ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి కొత్త షూటింగ్ మొదలుపెట్టడానికి నిర్మాతలు రెడీ అవుతున్న తరుణంలో.. ప్రేమీ ఒక్కో ఎపిసోడ్ కు 2లక్షల వరకూ డిమాండ్ చేస్తుందట.అయినా సరే మేకర్స్ వెనకడుగు వెయ్యకుండా.. ఆమె అడిగినంతా చెల్లించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.ఏమైనా ‘ప్రతిభకు రూపం అవసరం లేదు’ అని మన వంటలక్క మరోసారి ప్రూవ్ చేసింది.