Nirupam Paritala: తెరవెనుక సత్తా చాటబోతున్న నిరుపమ్ పరిటాల!

  • June 10, 2022 / 10:17 AM IST

తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ ద్వారా పరిచయమయ్యి విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా బుల్లితెర శోభన్ బాబు గా పేరు సంపాదించుకున్నారు నటుడు నిరుపమ్ పరిటాల. ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఈ సీరియల్లో డాక్టర్ పాత్రలో నటించిన ఇతను ఏకంగా డాక్టర్ బాబుగా అందరికీ గుర్తుండిపోయారు. ఇకపోతే ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో భాగంగా డాక్టర్ బాబు పాత్రను పూర్తిగా తీసేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డాక్టర్ బాబు తిరిగి ఈ సీరియల్లో కి రీ ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏ విధమైనటువంటి నిజం లేదని స్వయంగా నిరుపమ్ పరిటాల వెల్లడించారు. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కి దూరమైన ఈయన ఏం చేస్తున్నారనే విషయానికి వస్తే… తన భార్య మంజులతో కలిసి నిరుపమ్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని ఒక కాంటెస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలోని ఎక్కువగా డాక్టర్ బాబు గురించి పెద్ద ఎత్తున ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కి దూరమైన మీరు మరే సీరియల్స్ లో నటిస్తున్నారు అటు ప్రశ్నించగా ఈ ప్రశ్నకు డాక్టర్ బాబు సమాధానం చెబుతూ..

ప్రస్తుతం తాను ఎలాంటి సీరియల్స్ లో నటించలేదని అయితే సీరియల్స్ ప్రొడక్షన్ చేస్తానంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. నిర్మాతగా మారి డాక్టర్ బాబు సీరియల్స్ నిర్మిస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.అదేవిధంగా ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించానని త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడుతుందని తెలిపారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus