వాళ్ల పై కేసు వేస్తానంటున్న నటి..!

  • March 3, 2020 / 07:26 AM IST

కొన్ని ట్రెండ్ సెట్ చేసిన డైలీ సీరియల్స్ లిస్ట్ లో ‘చక్రవాకం’ ‘మొగలిరేకులు’ తర్వాత ఇప్పుడు ‘కార్తీకదీపం’ అనే చెప్పాలి. ఈ సీరియల్ ఇప్పుడు టెలివిజన్ రంగంలోనే అత్యధిక టి.ఆర్.పి ని నమోదు చేస్తున్న సీరియల్ గా రికార్డు సృష్టిస్తుంది. ఇంతలా ఈ సీరియల్ పాపులర్ అవ్వడానికి కారణం వంటలక్క పాత్ర అనే చెప్పాలి. ఈ పాత్రను పోషిస్తుంది ప్రేమి విశ్వనాథ్. మలయాళ నటి అయిన ఈమె ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసిందనే చెప్పాలి. అయితే సడెన్ గా ఈ సీరియల్ నుండీ ఈమె తప్పుకుంటుంది అని వార్తలు రావడంతో.. చర్చనీయాంశం అయ్యింది.

ఆమె స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారు అనే ప్రచారం జోరందుకోవడంతో… స్వయంగా ప్రేమి విశ్వనాథ్.. తన ఫేస్ బుక్ లైవ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “కార్తీక దీపం సీరియల్‌‌ నుండీ నేను తప్పుకుంటున్నాను అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఓ యూట్యూబ్ ఛానల్ వారు కావాలని అలా ఫేక్ న్యూస్‌ ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ఛానల్ పై కేసు వేసేందుకు మా సీరియల్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఇలాంటి న్యూస్‌ ప్రచారం చేస్తే ఏం వస్తుంది? నా ఫ్యాన్స్‌ చాలా బాధపడుతున్నారు. చాలా మంది నాకు మెసేజ్‌ చేసి చెబుతున్నారు. కొందరు ఎందుకిలా అసత్య ప్రచారం చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది ప్రేమి విశ్వనాథ్.


‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus