Karthika Deepam: హాట్ టాపిక్ గా మారిన హిమ, శౌర్య.. ల రెమ్యూనరేషన్..!

  • May 24, 2021 / 01:37 PM IST

బుల్లితెర పై ఓ ‘బాహుబలి’ రేంజ్లో చలామణి అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్ గురించి తెలియని వారంటూ ఉండరు..! సాధారణంగా సీరియల్స్ అంటే ఎక్కువగా గృహిణులు మాత్రమే చూస్తుంటారు అనే అపోహ ఉంది. కానీ ఈ సీరియల్ ను ఇంటిల్లిపాది చూస్తుంటారు. అందుకే మొదటి నుండీ ఈ సీరియల్ టి.ఆర్.పి రేటింగ్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఈ సీరియల్లో నటించే నటీనటులందరూ చాలా పాపులర్ అయిపోయారు. డాక్టర్ బాబుగా చేస్తున్న నిరుపమ్, వంటలక్క గా చేస్తున్న ప్రేమి విశ్వనాథ్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.

ఇక వీళ్ళ పిల్లలు హిమ, శౌర్య లు చేస్తున్న చిన్నారులు కూడా బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా.. ‘కార్తీక దీపం’ సీరియల్ కు గాను ఈ పిల్లలు ఎంత వరకూ పారితోషికం అందుకుంటారు అనే చర్చ.. కొద్దిరోజులుగా నడుస్తుంది. సాధారణంగా అయితే లీడ్ యాక్టర్స్ కు ఎపిసోడ్ ల లెక్కన పారితోషికం చెల్లిస్తారు అనే టాక్ ఉంది. కానీ సైడ్ క్యారెక్టర్లకు అలాగే చిన్న పిల్లలకు రోజూ వారి లెక్కన పారితోషికం చెల్లిస్తారట.

ఒక రోజు షూటింగ్లో ఎన్ని ఎపిసోడ్లైన చిత్రీకరిస్తారు. ఈ నేపథ్యంలో బేబీ కృతిక, బేబీ సహృద లకు రోజుకి ఇంతని పారితోషికం చెల్లిస్తారని సమాచారం. ఆ లెక్కన చూసుకుంటే ఒక రోజుకి గాను రూ.20 వేల నుండీ రూ.30 వేల రూపాయల వరకూ ఈ చిన్నారులకు పారితోషికం చెల్లిస్తున్నారు అని వినికిడి.అంటే నెల మొత్తం కలిపి వీళ్ళ సంపాదన లక్షల్లో ఉంటుందన్న మాట.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus