సూపర్ హిట్ సీరియల్ ను సినిమాగా తెరకెక్కించబోతున్నారా?
June 23, 2020 / 09:00 AM IST
|Follow Us
షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం వలన సినిమాల సంగతి ఏమో కానీ వంటలక్క అభిమానులకు మాత్రం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. నేను ఏ విషయం గురించి చెబుతున్నానో ఈ పాటికే మీకు అర్థమైపోయుంటుంది కదా..! యెస్.. ‘కార్తీక దీపం’ సీరియల్ గురించే..! సాయంత్రం 7:30 అయితే చాలు.. ఎవరింట్లో చూసినా .. ఇదే సీరియల్ రన్ అవుతూ ఉంటుంది. 7 గంటల నుండే గృహినులు టీవీ రిమోట్లు దాచేసి మరీ ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.. అంటే ఈ సీరియల్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
కాపుగంటి రాజేంద్ర డైరెక్షణ్లో తెరకెక్కిన ఈ సీరియల్.. కథ పరంగా ఏమాత్రం కొత్తది కాదు. మలయాళం సీరియల్ ‘కరుతముతూ’ కి ఇది రీమేక్. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగినట్టుగా ఈ సీరియల్ ను తెరకెక్కిస్తున్నారు రాజేంద్ర. ఈ సీరియల్ కు ప్రధాన ఆకర్షణ ముగురు పాత్రలే అని చెప్పాలి. అందులో లీడ్ రోల్ పోషిస్తున్న వంటలక్క అలియాస్ దీప(ప్రేమీ విశ్వనాథ్) , డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్(పరిటాల నిరుపమ్) అలాగే అత్త సౌందర్య (అర్చన అనంత్). ఈ 3 పాత్రలే ఈ సీరియల్ కు హైలెట్ అని చెప్పాలి.
అయితే ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ ను.. సినిమాగా తెరకెక్కించి క్యాష్ చేసుకోవాలి అని ఓ యువ దర్శకుడు భావిస్తున్నాడట. ఆ సినిమాలో ‘వంటలక్క సవతి తల్లికి ఓ కొడుకు ఉండి. వంటలక్క అదే దీపతో ఎంతో అన్యున్యంగా, ప్రేమగా ఉంటూ….. చివరికి ఆమె కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది’ అనే పాయింట్ తో ఈ కథను రెడీ చేసుకుంటున్నాడట. ఆ కుర్ర డైరెక్టర్ ఆత్రం కాకపోతే.. ఈ సీరియల్ సినిమాగా సక్సెస్ అవుతుందా చెప్పండి..!