బాహుబలి సినిమాతో తెలుగు ప్రజలందరూ గర్వించేలా చేశారు రాజమౌళి. అతని ఊహాత్మక శక్తికి, టేకింగ్ ట్యాలెంట్ కి అందరు ఔరా అన్నారు. అతనికంటే ఓ వ్యక్తి బాగా డైరక్ట్ చేసాడని చెప్పుకుంటున్నాడు. అతనెవరో కాదు.. రాజమౌళి తనయుడు కార్తికేయ. రీసెంట్ గా అతను అఖిల్ తో కలిసి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నంబర్ వన్ యారి షోకి హాజరయ్యారు. అందులో రానా అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పిన కార్తికేయ.. అతను ఇచ్చిన ఓ టాస్క్ దగ్గర ఇరుక్కున్నాడు. రాజమౌళికి ఫోన్ చేయాలని, తండ్రి కంటే నువ్వు తీసిన సీన్స్ బాగున్నాయని జనాలు అనుకుంటున్నట్లుగా చెప్పాలని సూచించాడు. కార్యక్రమంలో ఇదొక భాగం కనుక కొంచెం భయపడుతూనే రాజమౌళికి కార్తికేయ ఫోన్ చేసాడు.
రానా చెప్పినట్లే కార్తికేయ చెప్పాడు. అందుకు జక్కన్న నుంచి వచ్చిన సమాధానం షాక్ కి గురికిచేసింది “ఆ సీన్స్ నువ్వే తీశానని చెప్పడానికి.. మనమేమైనా సబ్ టైటిల్స్ వేశామా” అంటూ రాజమౌళి క్వశ్చన్ చేయడంతో.. ఆ వెంటనే రానా అలా చెప్పమన్నట్లుగా కార్తికేయ బయటపెట్టాడు. ఇది నెంబర్ 1 యారీ ప్రోగ్రామ్ కోసం అని అర్ధం కావడంతో… అటు రాజమౌళి, షో హోస్ట్, గెస్ట్ లతో పాటు చూసే ప్రేక్షకులు సరదాగా నవ్వుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.