Kartikeya: మెగాస్టార్ టైటిల్ తో కార్తికేయ.. రిస్కేనా..?

  • June 23, 2021 / 06:55 PM IST

ఆర్ఎక్స్ 100 సినిమాలో నటించి ఓవర్ నైట్ లో కార్తికేయ తనకంటూ మంచి పేరును, గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే కార్తికేయ కెరీర్ లో ఆ సినిమా మినహా మరో హిట్ లేదు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ రోల్ చేసినా ఆ సినిమా కూడా కార్తికేయ కెరీర్ కు ప్లస్ కాలేదు. ఈ ఏడాది చావుకబురు చల్లగా సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్న కార్తికేయకు నిరాశే ఎదురైంది. చావుకబురు చల్లగా సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో పాటు పెద్దగా కలెక్షన్లు రాలేదు.

కార్తికేయ కొత్త సినిమాకు రాజా విక్రమార్క అనే టైటిల్ ఫిక్స్ కాగా ఈ టైటిల్ పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దాదాపు మూడు దశాబ్దాల క్రితం రాజా విక్రమార్క అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కార్తికేయ సినిమా రిలీజయ్యాక అంచనాలను అందుకోలేకపోతే మాత్రం కార్తికేయ మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ సినిమాను శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఈ సినిమాలో కార్తికేయ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్ గా కనిపించనుండగా కార్తికేయకు జోడీగా తాన్య రవిచంద్రన్ నటించనున్నారు. ఈమె ప్రముఖ తమిళ నటుడు రవిచంద్రన్ మనవరాలు కావడం గమనార్హం. టైటిల్ తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మెగాస్టార్ టైటిల్ తో కార్తికేయ రిస్క్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus