ముందుగా రానున్న కాటమరాయుడు

  • January 31, 2017 / 12:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న కాటమరాయుడు సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫిల్మ్ ని నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ఈనెల 26 న రిలీజ్ అవుతుందని అందరూ ఎదురుచూసారు. కానీ ప్రత్యేక హోదా కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం టీజర్ ని ఫిబ్రవరిని 5 విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే చిత్ర రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు.

తొలుత ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 29 న థియేటర్లలోకి తీసుకురావాలని భావించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం అనుకున్న తేదీ కంటే ఐదు రోజుల ముందుగానే కాటమరాయుడు థియేటర్లోకి రానున్నాడు. అంటే మార్చి 24 ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ రెండు విషయాలను నిర్మాత  అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus