ఆ డైరెక్టర్ ఒత్తిడి చేయడం వలనే ఈ చిత్రంలో నటించా..!
December 21, 2018 / 12:25 PM IST
|Follow Us
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో కత్రీనా కైఫ్ ఒకరు. అయితే ఈ మధ్య కత్రీనా కైఫ్ జోరు కాస్త తగ్గినట్టే ఉంది. ఈ మధ్య కత్రినా కు సరైన హిట్టులేదనే చెప్పాలి. ఒక పక్క ఐటెం సాంగ్స్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. అయితే ఎన్నో అసలు పెట్టుకుని చేసిన ‘ఆమిర్ ఖాన్’ ‘అమితాబ్ బచ్చన్’ ల ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రం కూడా ఘోర డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా హీరోగా వచ్చిన ‘జీరో’ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది కత్రినా.
ఇక తాజాగా ఏర్పాటు చేసిన ‘జీరో’ ప్రమోషన్లలో పాల్గొంది ‘కత్రినా. అయితే ఈ చిత్రం గురించి ఎవరూ ఊహించనంతగా సంచలన కామెంట్లు చేసింది. వివరాల్లోకి వెళితే ‘జీరో’ చిత్రంలో డ్రింకింగ్ అలవాటు కు బానిసయిన ఒక హీరోయిన్ గా కత్రినా కనిపించనుందట. అయితే ఆ పాత్ర చేయడం తనకెంత మాత్రం ఇష్టం లేదని తెలపడం చర్చనీయాంశం అయ్యింది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్.. ‘నువ్వు ఆ పాత్ర కచ్చితంగా చేయాలి ‘ అని కత్రినాకు చెప్పడంతో ఆ పాత్ర చేసిందట. ఏమాత్రం తనకిష్టం లేకుండానే నటించిందట. సినిమాలో కేవలం అర్థ గంట మాత్రమే ఉండే పాత్రకి నేనవసరమా అని దర్శకుడు కి ఎంత చెప్పినా వినలేదంట. ఇక ఈ పాత్ర చేస్తున్నంత సేపు చాలా చిరాకుగా ఉండేదని.. షూటింగ్ పూర్తయిన వెంటనే తనకు చాల మనశాంతిగా ఉందని చెప్పుకొచ్చింది. కేవలం తాగుడుకు బానిసగా ఉండే అమ్మాయి క్యారక్టర్ కే ఇంత హడావుడి అవసరమా అంటూ సోషల్ మీడియాలో కత్రినా పై కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న (ఈరోజు) విడుదల కానుంది.