‘బిగ్ బాస్ 3’ లో నా పేరు వాడటానికి వీల్లేదు

  • July 25, 2019 / 04:25 PM IST

‘కింగ్’ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ 3’ ఈమధ్యే ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాని హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 2’ లో పెద్దగా పరిచయం ఉన్న సెలెబ్రిటీలు రాలేదు.. అందులోనూ వారు వ్యవహరించిన తీరు కాస్త నిరాశపరించిందనే చెప్పాలి. ఇక చిన్న విషయాలకే వారు గొడవలు పడుతూ హౌస్ మొత్తం రచ్చ చేయడమే కాకుండా హౌస్ నుండీ బయ్యకి వచ్చినా గొడవలు ఆపలేదు. అందుకే ఈసారి అందరికీ పరిచయమున్న కంటెస్టెంట్లతోనే సీజన్ ను మొదలు పెట్టారు. బిగ్‌బాస్ 1, 2ల కంటే ‘బిగ్ బాస్’ 3కి మరింత ఆదరణ పెరిగేలా ఉంది.

ఇదిలా ఉండగా ‘బిగ్ బాస్ సీజన్ 2’ విన్నర్ కౌశల్ తాజాగా ‘తన పేరు బిగ్ బాస్3′ లో ను ఎక్కడా వాడటానికి వీల్లేదంటూ’ వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు ‘బిగ్‌బాస్‌ 3’ పబ్లిసిటీ కోసం కానీ ఇంటర్వ్యూల కోసం కానీ… ‘కౌశల్‌ ఆర్మీ’ అన్న పేరును ప్రస్తావించకూడదని పేర్కొన్నాడు. ‘బిగ్ బాస్2’ లో మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కౌశల్ టార్గెట్ చేస్తున్నారంటూ ‘కౌశల్ ఆర్మీ’ ఏర్పాటు చేసి.. కౌశల్ కు అండగా నిలిచారు ప్రేక్షకులు. అయితే ‘బిగ్ బాస్ సీజన్ 3’ మొదలవ్వగానే ‘శ్రీముఖి ఆర్మీ’ అంటూ సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసి అప్పుడే రచ్చ మొదలు పెట్టేసారు. అందుకే కౌశల్ ఇలా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus