బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గురించి లైవ్ షోలో బయటపడ్డ నిజాలు

  • November 21, 2018 / 08:15 AM IST

షో హోస్ట్ చేసిన్ నాని కంటే కూడా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొన్న కౌశల్ మరియు అతని ఆర్మీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే.. కౌశల్ & గ్యాంగ్ మీద పాజిటివ్ కంటే నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం సదరు గ్యాంగ్ చేసిన కొన్ని పనులే. అయితే.. బిగ్ బాస్ షోలో ఉన్నప్పటికంటే.. షో విన్ అయ్యి బయటకొచ్చాక కౌశల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తనకు పి.ఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని, తనకు డాక్టరేట్ ఇవ్వబోతున్నారని, తనకు వచ్చిన వోట్స్ కి గిన్నీస్ రికార్డ్ వచ్చిందని అబ్బో ఇలా చాలా చెప్పుకుంటూ పోయాడు. ఈ మాటలన్నీ విని కౌశల్ ఆర్మీ తెగ సంతోషపడిపోతే.. జనరల్ ఆడియన్స్ మాత్రం ఇవేం ఎక్స్ట్రాలు అంటూ తిట్టిపోశారు.

నిన్న ఓ న్యూస్ చానల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో కౌశల్ ఇప్పటివరకూ చెప్పుకొచ్చిన విషయాలన్నీ అబద్ధం అని తేటతెల్లమైంది. అయితే.. ఇక్కడ కౌశల్ అబద్ధాలు చెప్పాడా లేక కౌశల్ కి ఇలాంటి ప్రామిస్ లు చేసినవాళ్లు అబద్ధాలు చెప్పారా? అనేది తెలియాల్సి ఉండగా.. నిన్నమొన్నటివరకూ కౌశల్ ఆర్మీ అంటూ ఎగిరినవాళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. గొప్పలకు పోయి ఉన్న పేరు పోగొట్టుకోవడం అంటే ఇదేనేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus