కవచం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

  • November 30, 2018 / 10:06 AM IST

శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమా ‘కవచం’. ఇందులో కాజల్ అగర్వాల్, మెహ్రిన్ హీరోయిన్లుగా, బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కుతున్న ఈ సినిమాలో మొదటిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ పాత్రలో నటించాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని డిసెంబర్ 7 విడుదల చేయనున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు.

‘కవచం’ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందనే సమాచారం ఉన్నప్పటికీ మొదటివారంలోనే సినిమా విడుదల అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఇంకా వారం రోజులు సమయం మాత్రమే ఉండగా సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయితే డిసెంబర్ 21 న నాలుగు సినిమాలు విడుదల అవుతుండగా అందులో ఏది హిట్ అయినా దాని ప్రభావం ఈ సినిమా పైన ఉంటుందని భావించిన నిర్మాతలు అందుకే ఈ సినిమాని డిసెంబర్ 7 న విడుదల చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రచారాన్ని రేపటినుండి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే డిసెంబర్ 7 న ‘సుబ్రహ్మణ్యపురం’, ‘భైరవగీత’, ‘హుషారు’ సినిమాలు కూడా ఈ సినిమాకి పోటీగా విడుదల అవుతున్నాయి. మరి ‘కవచం’ సినిమా ఈ సినిమాలకు ఎలాంటి పోటీని ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus