Keedaa Cola: ‘కీడా కోలా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
November 4, 2023 / 01:28 PM IST
|Follow Us
‘పెళ్ళిచూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి రెండు కల్ట్ మూవీస్ ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఈసారి రూటు మార్చి ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘విజి సైన్మా’ బ్యానర్ పై కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్..లు ఈ చిత్రాన్ని నిర్మించగా… రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
అందుకే ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
3.50 cr
సీడెడ్
0.40 cr
ఆంధ్ర(టోటల్)
3.00 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
6.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
8.10 cr
‘కీడా కోలా’ (Keedaa Cola) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.8.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే… బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్ళిచూపులు’ చిత్రం రూ.15 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా.. ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రం రీ రిలీజ్ లో రూ.3.5 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ‘కీడా కోలా’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి