చేతులు దులిపేసుకోవడానికే పెద్ద సినిమాల మధ్య దింపుతున్నారా?

  • August 8, 2023 / 12:44 PM IST

‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి కొడుకు సింహా కోడూరి. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. రీ రిలీజ్ చేసినా ఈ సినిమాని ఎగబడి చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే హీరోగా చేసిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న సింహా కోడూరి.. ఆ తర్వాత ప్రామిసింగ్ హీరోగా నిలబడే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ కట్ చేస్తే ఆ రేంజ్లో ఇతను మెప్పించలేకపోతున్నాడు. ఆ తర్వాత సింహా హీరోగా ‘తెల్లవారితే గురువారం’ ‘దొంగలున్నారు జాగ్రత్త’ వంటి సినిమాలు వచ్చి వెళ్లాయి అనే సంగతి చాలా మందికి తెలీదు.

ఇక సింహా ఓ రేంజ్లో ప్రమోట్ చేసి రిలీజ్ చేసిన ‘భాగ్ సాలే’ కూడా పెద్ద ప్లాప్ అయ్యింది. త్వరలో అతను ‘ఉస్తాద్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 12 నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ప్రమోషన్స్ మాత్రం జరగడం లేదు. ‘వారాహి’ వంటి సక్సెస్ ఫుల్ బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన సినిమా ఇది. ఫణిదీప్ దర్శకుడు. రిలీజ్ కి వారం కూడా లేదు.అలాగే ప్రమోషన్స్ జాడే లేదు అని చెప్పాలి.

మరోపక్క చిరంజీవి ‘భోళా శంకర్’, రజినీకాంత్ ‘జైలర్’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ప్రేక్షకులకి ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఆ సినిమాలే ఉంటాయి. మరి ‘ఉస్తాద్’ ను మేకర్స్ నిజంగానే రిలీజ్ చేస్తారా? లేక చేతులు దులిపేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus