‘ప్రభాస్’ను కీరవాణి హీరోనే కాదంటున్నాడు!!!

  • March 29, 2017 / 09:49 AM IST

టాలీవుడ్ లో కొన్ని వంశాలకు ప్రత్యేక అభిమానులు….విపరీతమైన అభిమానం ఉంటుంది…అందులో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడి వంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఇక అదే క్రమంలో అక్కినేని ఫ్యామిలీకి కూడా భారీ అభిమాన తరంగమే ఉంది…ఇక కాలక్రమేణా మన మెగా ఫ్యామిలీకి సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది…ఇక మరో పక్క ఘట్టమనేని కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇలా చెప్పుకుంటూ పోతే అదే కోవలోకి వస్తుంది…మన రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీ సైతం…టాలీవుడ్ లో అప్పటి హీరోల్లో కృష్ణం రాజుకి చాలా ప్రత్యేకత ఉంది…

అదే క్రమంలో…ఆయన నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్…తొలి రోజుల్లో పెద్దగా ఆకట్టుకొకపోయినప్పటికీ…ఛత్రపతి..డార్లింగ్…మిస్టెర్ పర్ఫెక్ట్, ఇక మిర్చి…ఇక వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు ప్రభాస్….ఇక అదే క్రమంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు అయ్యాడు. ఒక్కసారిగా…ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా…బాహుబలి 2లో తన విశ్వరూపం చూపించాడు ఈ హీరో…అయితే ప్రభాస్ లేకపోతే ఈ సినిమా లేదు అని సాక్షాత్తూ దర్శకుడు రాజమౌళి చెబుతున్నప్పటికీ…..అసలు ప్రభాస్ హీరోనే కాదు అంటున్నాడు….సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి. విషయంలోకి వెళితే…

మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో  ప్రభాస్ తో తనుకు ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ..అసలు ప్రభాస్ హీరో కాదు ఎందుకంటే….. అతడిలో అహం లేదు , ఫోజు కొట్టడం రాదు .. స్టైల్ కొట్టడు పైగా బిల్డప్ లేని హీరో ఇక ఇతడ్ని హీరో అని ఎలాగంటాం అని షాక్ ఇచ్చాడు.  అయితే మొదట కీరవాణి ప్రభాస్ అసలు హీరో కాదు అనగానే అంతా షాక్ అయ్యారు..ఒక్కసారే సైలెంట్ అయ్యారు. కానీ తర్వాత కీరవాణి తన అభిమానాన్ని చాటడంతో ఒక్కసారిగా….చప్పట్ల మోతలు మోగాయి. అదీ అన్న మాట అసలు మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus