Bimbisara Movie: కళ్యాణ్ రామ్ సినిమా కోసం కీరవాణి సాంగ్!

  • March 24, 2022 / 05:15 PM IST

‘ఎంతమంచి వాడవురా..’ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నుంచి మరో సినిమా ఇప్పటివరకు రాలేదు. నిజానికి ఆయన ‘బింబిసార’ సినిమా షూటింగ్ పూర్తి చేసి చాలా కాలమైంది. కానీ ఇంకా రిలీజ్ డేట్ సెట్ కావడం లేదు. డిసెంబర్ లో విడుదల చేస్తారని అన్నారు కానీ అది జరగలేదు. ఇప్పుడు ఏప్రిల్ కూడా వచ్చేస్తోంది. మరి రిలీజ్ డేట్ ని ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాకి డైరక్టర్ ఆఫ్ మ్యూజిక్ గా సంతోష్ నారాయణ్ పేరు టీజర్ లో కనిపించింది.

Click Here To Watch NOW

అయితే పాటలు చిరంతన్ భట్ అని మరో పేరుని యాడ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క పాటను కూడా విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో కీరవాణి పేరు కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. హిస్టారికల్ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి కీరవాణితో ఒక పాటను రీరికార్డింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ పూర్తయితే కానీ సినిమా రిలీజ్ కి నోచుకోదు.

తనపై దండెత్తడానికి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా కళ్యాణ్ రామ్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జోడీగా ఇద్దరు హీరోయిన్స్ కేథరిన్‌, సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి రెండో భాగం కూడా ప్లానింగ్ లో ఉంది. మొదటి పార్ట్ విడుదలైన తరువాత దాని రిజల్ట్ ని బట్టి పార్ట్ 2 విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus