నితిన్ తో వర్కౌట్ అయింది.. కీర్తి కామెంట్స్ వైరల్..?

  • March 22, 2021 / 08:00 PM IST

మహానటి తరువాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కీర్తి సురేష్ రంగ్ దే సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. రంగ్ దే థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కీర్తి కెరీర్ లో మరో సక్సెస్ చేరినట్లే అని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీర్తి గతంలో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రలో రంగ్ దే సినిమాలో నటిస్తూ ఉండటం గమనార్హం. హీరోను ఏడిపించే పాత్రలో నటిస్తున్న కీర్తికి ఈ సినిమా తరువాత యంగ్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రంగ్ దే సినిమాకు మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తున్న చిత్రయూనిట్ నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కీర్తి సురేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంగ్ దే ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్ కు కీర్తి సురేష్ ధన్యవాదాలు తెలిపారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన రెండు సినిమాల్లో గతంలో తాను నటించానని ఆ సినిమాలలా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నానని ఆమె అన్నారు.

రంగ్ దే సినిమాతో దేవి శ్రీ ప్రసాద్, తాను హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకాన్ని కీర్తి వ్యక్తం చేశారు. సినిమాలో సంగీతం చాలా బాగుందని.. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ఆమె తెలిపారు. దర్శకుడు వెంకీ అట్లూరిని చాలామంది అమాయకుడు అనుకుంటున్నారని.. అతని నిజ స్వరూపం ఎవరికీ తెలియదంటూ కీర్తి కామెంట్లు చేశారు. ఆ తరువాత తాను ఆట పట్టించడానికే అలా చెప్పానని కీర్తి తెలిపారు.

వెంకీ అట్లూరి కథ చెప్పిన వెంటనే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.. స్కీన్ పై నితిన్ తో కెమిస్ట్రీ వర్కౌట్ అయిందంటూ కీర్తి హాట్ కామెంట్స్ చేశారు. ఈ నెల 26వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలని కీర్తి సురేష్ కోరారు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus