Keerthy Suresh: అలా పిలిస్తే చిరంజీవి కొడతారేమో.. కీర్తి సురేష్ ఏమన్నారంటే?
August 7, 2023 / 06:00 PM IST
|Follow Us
ఈ ఏడాది ఆగష్టు నెలలో విడుదలవుతున్న సినిమాల్లో భోళా శంకర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ సినిమా కావడం, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉండటం, కమర్షియల్ అంశాలు ఎక్కువగానే ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. హైదరాబాద్ లో భోళా శంకర్ మూవీ బుకింగ్స్ ఇప్పటికే మొదలు కాగా టైర్2, టైర్3 సిటీలలో ఈ సినిమా బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ భోళా శంకర్ మూవీ సెట్ లో ఇంటి భోజనం గురించి మాట్లాడేదానినని చిరంజీవి గారి ఇంట్లో చేసే ఉలవచారు అంటే నాకెంతో ఇష్టమని తెలిపారు.
షూటింగ్ లో ఉన్నన్ని రోజులు అన్నం, ఉలవచారుతో మంచి ఆహారం తిన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయని భోళా శంకర్ మూవీ ద్వారా మంచి జ్ఞాపకాలు ఏర్పడ్డాయని కీర్తి సురేష్ వెల్లడించారు. చిరంజీవి గారు ఎంతో ప్రశాంతంగా ఉంటారని తెలియని విషయాన్ని ఓపికతో చెబుతారని చిరంజీవి గారిలో నచ్చే గుణం ఇదేనని కీర్తి సురేష్ పేర్కొన్నారు.
సినిమాలో చిరంజీవి చెల్లిగా (Keerthy Suresh) నటించినా రియల్ లైఫ్ లో చిరు సర్ అని పిలిచేదానినని ఆమె చెప్పుకొచ్చారు. అన్నయ్య అని పిలిస్తే చిరంజీవి గారు కొడతారేమో అని కీర్తి సురేష్ సరదాగా చెప్పుకొచ్చారు. భోళా శంకర్ మూవీ ప్రమోషన్స్ అదుర్స్ అనేలా జరుగుతున్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా భోళా శంకర్ మూవీ భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చిరంజీవి తర్వాత సినిమాలు మల్లిడి వశిష్ట , కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు అంచనాలకు మించి సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.