Keerthy Suresh: పెళ్లి విషయంలో కీర్తి సురేష్ ఫైనల్ డెసిషన్ అదేనట..!
April 1, 2021 / 05:01 PM IST
|Follow Us
కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఈమె పెళ్లి డేట్ ఫిక్స్ అంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈమె మాత్రం అవన్నీ అవాస్తవాలే అంటూ కొట్టిపారేసింది. అయితే పెళ్లి విషయంలో ఈమెకు క్లారిటీ ఉన్నట్టు తాజాగా చెప్పుకొచ్చింది.ఇటీవల నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ‘రంగ్‌దే’ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 26న విడుదలైన చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
వీటి ప్రమోషన్లలో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘ నేను పెళ్ళికి అతీతం ఏమీ కాదు. నాకు నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి రెడీ. అయితే నాకు కాబోయే భర్త విషయంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి.అతనిలో మానవత్వం మెండుగా ఉండాలి. అదొక్కటే నేను కోరుకునేది. అలా అని నాకు వెంటనే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. దానికి ఇంకా టైం ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నాకు ఇప్పటికే 3,4 సార్లు పెళ్లి చేసేసారు’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం రజినీ కాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాతె’ చిత్రంలో నటిస్తుంది.దీనికి సిరుతై శివ దర్శకుడు. దాంతో పాటు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. పరశురామ్ బుజ్జి ఈ చిత్రానికి దర్శకుడు.ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది ఎండింగ్లో కానీ.. 2022 ప్రారంభంలో కానీ విడుదలయ్యే అవకాశం ఉంది.