ఈ లాక్ డౌన్ టైములో ఓటిటికి మంచి డిమాండ్ ఏర్పడింది. 3 నెలలు పైనే థియేటర్స్ మూతపడి ఉన్నాయి. ఇక చిన్నా చితకా సినిమాలు తప్ప కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు ఏమీ విడుదల ఓటిటిలో విడుదల కాకపోవడంతో జనాలు కూడా నిరాశకు లోనయ్యారు. ఆ టైంలో కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రం విడుదలయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. ‘ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా.. సెకండ్ హాఫ్ మధ్య నుండీ తేలిపోయిందనే’ కామెంట్స్ వినిపించాయి.
అయితే జనాలు మాత్రం ఈ సినిమాని ఎగబడి చూస్తున్నారు. సినిమా కాస్త ఎంగేజింగ్ గా ఉంది కాబట్టి.. అందులోనూ అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు కాబట్టి అమెజాన్ వారికి బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని 5 కోట్ల బడ్జెట్ లోనే నిర్మించి.. అమెజాన్ వారికి 7.5 కోట్లకు అమ్మారట ‘పెంగ్విన్’ నిర్మాతలు. ప్రేక్షకులు ఈ సినిమాని ఎంత సేపు చూసారు అనే దానిని బట్టి మరింత అమెజాన్ వారు ‘పెంగ్విన్’ నిర్మాతలకు చెల్లిస్తారట. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి కీర్తి సురేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.
ఈ చిత్రానికి గాను కీర్తి సురేష్ 2 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే.. ‘పెంగ్విన్’ సినిమాని 3 కోట్లలోనే ఫినిష్ చేసారని స్పష్టమవుతుంది. సినిమాలో పెద్ద క్యాస్టింగ్ ఏమీ లేదు. కీర్తి సురేష్ మాత్రమే ఈ సినిమాలో అందరికీ తెలిసిన మొహం అని చెప్పాలి. అందుకే ఆమెకు అంత పారితోషికం దక్కినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే