Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి కోసం అలాంటి రిస్క్ చేస్తున్నారా?

  • March 11, 2023 / 01:09 PM IST

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్లలో ఒకరనే సంగతి తెలిసిందే. ప్రసుతం కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారు. అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను వేగంగా పూర్తి చేయాలని కీర్తి సురేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో మూడు వారాల్లో దసరా మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే కీర్తి సురేష్ పెళ్లిపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ వయస్సు 30 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. అయితే కీర్తి సురేష్ పెళ్లి ఎప్పుడు? ఆమె ఎవరిని పెళ్లి చేసుకోనున్నారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. కొత్త సినిమాలకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని బోగట్టా. ఒకవేళ కీర్తి సురేష్ నిజంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతారో లేదో తెలియాల్సి ఉంది.

కీర్తి సురేష్ పారితోషికం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. కీర్తి సురేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కీర్తి సురేష్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్స్ కు జోడీగా కీర్తి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కీర్తి సురేష్ స్టార్స్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కీర్తి సురేష్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆమె పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కీర్తి సురేష్ తో పాటు ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకోవడంతో కీర్తి సురేష్ కూడా పెళ్లిపై ప్రధానంగా దృష్టి పెట్టారని బోగట్టా. కీర్తి సురేష్ ఈ ఏడాదే పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాలి. దసరా మూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus