నాని సరసన మరో మలయాళ కుట్టి!

  • June 3, 2016 / 09:57 AM IST

ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జెంటిల్ మెన్” చిత్రంలో నివేదా థోమస్ అనే మలయాళ ముద్దుగుమ్మతో సరసాలాడుతున్న నేచురల్ స్టార్ నాని, త్వరలో “సినిమా చూపిస్త మావ” ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మరో మలయాళ బ్యూటీతో ఆడిపాడనున్నాడని తెలుస్తోంది.

“నేను శైలజ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళ కుట్టి కీర్తి సురేష్ ను కలిసిన త్రినాధరావు, స్క్రిప్ట్ వివరించగా.. కీర్తి సురేష్ సమ్మతం తెలిపిందని, అయిటే.. డేట్స్ సెట్ చేసుకొని ఓకే చెబుతానని చెప్పిందని సమాచారం. కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళంలో విజయ్ 60వ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus