మాజీ ప్రేయసి కుమార్తెకే ఓటేసిన సల్మాన్!

  • May 18, 2016 / 12:29 PM IST

ఈమధ్య కాలంలో సల్మాన్ తన సన్నిహితుల పిల్లలను హీరో లేదా హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం చేయడం సైడ్ బిజినెస్ గా పెట్టుకొన్నట్లున్నాడు. తన బ్యానర్ లో నిర్మింపబడే సినిమాల్లో కీలకపాత్రల్లో తనకు సన్నిహితులైన వారి పిల్లల్ని ఎంపిక చేయడానికే మొగ్గు చూపుతున్నాడు.

తాజాగా జహీర్ అనే యువకుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ సల్మాన్ నిర్మించాలనుకొన్న ఓ సినిమా కోసం తొలుత కృతి సనన్ ను ఎంపిక చేసారు. కానీ, ఆమె ప్రస్తుతం వేరే సినిమా షూటింగ్ కోసం “బుడాపెస్ట్”లో ఉన్న కారణంగా ఆమె స్థానంలో సల్మాన్ చిన్నప్పటి స్నేహితురాలు మరియు సన్నిహితురాలు అయిన షాహీన్ కుమార్తె అయిన కైరాను సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేసారని తెలుస్తోంది. కేవలం కైరా పిన తల్లితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే కైరాను సల్మాన్ ఎంపిక చేసాడని బాలీవుడ్ మీడియా చెవులు కొరుక్కొంటోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus