పీవీపీ.. చిన్నప్పటి నుండీ పెద్ద నేరగాడు : కేశినేని నాని
March 25, 2019 / 04:22 PM IST
|Follow Us
కోలీవుడ్ నటి శృతి హాసన్ ను ప్రసాద్ వి పొట్లూరి (పీవీపీ) గతంలో బ్లాక్ మెయిల్ చేశారని… విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలు వ్యక్తం చేసారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి మరీ కాల్ షీట్లు తీసుకున్నారని.. ఆయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో రవితేజ నటించిన ‘బలుపు’ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.. కాగా ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా పీవిపీ నే..! ‘సైజ్ జీరో’ ‘క్షణం’ ‘ఊపిరి’ ‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్ర్రాల్ని నిర్మించారు పీవీపి. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ చిత్రానికి కూడా సహా నిర్మాతగా వ్యహరిస్తున్నాడు. ప్రస్తుతం విజయవాడ లోక్ సభ ఎన్నికల బరిలో టీడీపీ నుండీ కేశినేని, వైసీపీ నుండీ పీవీపీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.
కేశినేని నాని మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను పీవిపీ ఏడిపించాడని, మహేష్ బాబు తప్ప ప్రతి హీరోను అయన ఇబ్బంది పెట్టారని తెలిపాడు. మహేష్ బాబు మాత్రం పీవీపీ చేతికి చిక్కలేదని అయన చెప్పుకొచ్చాడు. కొంతమంది డైరెక్టర్లను కూడా పీవిపి ఏడిపించాడని సంచలన కామెంట్లు చేసాడు. గతంలో లీగల్ నోటీసుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి మారీ డేట్లను తీసుకునేవాడు పీవీపి. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇతనంటే అసహ్యం పుట్టింది. పీవీపీ ఒక క్రిమినల్, ఒక మోసగాడు. చిన్నప్పటి నుండే పెద్ద నేరగాడు. కెనరా బ్యాంకుకు రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్ననే నోటీసులు ఇచ్చారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్ళు వేళం వేస్తే, కనీసం రూ. 7 కోట్లు కూడా రాలేదు. జగతి పబ్లికేషన్స్ లో రూ. 147 కోట్ల మనీలాండరింగ్ కేసులు, హవాలా కేసులు, బొగ్గు స్కాములు ఇలా చాలా ఉన్నాయి. సెబీ కూడా రూ. 30 కోట్ల ఫైన్ వేసింది” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డాడు.