Ketika Sharma: కెరీర్‌ గురించి కేతిక శర్మ క్లారిటీ ఇదీ!

  • August 30, 2022 / 01:02 PM IST

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను అని చెబుతుంటారు మన పాత తరం నటులు. చాలామంది అలా అలరించిన నటులు చాలామందే ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌కి వచ్చి మూడో సినిమా చేస్తున్న కేతిక శర్మ కూడా ఇదే మాట చెబుతోంది. వాళ్ల ఇంట్లో వాళ్లు తనను డాక్టర్ని చేద్దాం అనుకుంటే ఆమె మాత్రం యాక్టర్‌ అవ్వాలనుంకుందట. అలా తన కలను సాకారం చేసుకుని ఇప్పుడు నటిగా కుర్రకారు మతులు పోగొడుతోంది. ఆమె కెరీర్‌ గురించి ఇంకా ఏం చెప్పిందంటే.

అందరిలాగే నేనూ నా సినిమా బాగా రావాలి, మంచి విజయాన్ని అందుకోవాలనే కోరుకుంటా. దాని కోసం నూరు శాతం కష్టపడి పని చేస్తాను. అయితే ఇక్కడి వరకే మన చేతుల్లో ఉంటుంది. సినిమా ఫలితం మన చేతుల్లో ఉండదు కదా.. అందుకే నా నియంత్రణలో లేని విషయాల గురించి ఆందోళన చెందను అని వర్క్‌ లైఫ్‌ మీ ఫుల్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కేతిక శర్మ. మా అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లే. నన్నూ డాక్టర్నే చేయాలనుకున్నారు. కానీ నేను సినిమాల్లోకి వచ్చాను.

చిన్నప్పటి నుండి నాకు నటన అంటే ఇష్టం. ఎప్పటికైనా సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించాలని కలలు కనేదాన్ని. మా ఇంట్లో ఈ విషయం చెప్పి ఒప్పించి ఇటువైపు వచ్చాను అని చెప్పింది కేతిక. ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో తెరపై డాక్టర్‌గా కనిపించబోతున్నాను. నన్ను డాక్టర్‌గా చూడాలన్న మా అమ్మానాన్నల కోరికను ఇలా రీల్‌ లైఫ్‌లో నెరవేరుతోంది అని ఆనందంగా చెప్పింది కేతిక. ఈ సినిమా సెప్టెంబరు 2న విడుదలవుతోంది.

సోషల్‌ మీడియాలో నాపై వచ్చే విమర్శల్ని ఎప్పుడూ పట్టించుకోను. అయితే కన్‌స్ట్రక్టివ్‌ కామెంట్స్‌ని మాత్రం తీసుకుంటాను. నటిగా అన్ని రకాల జోనర్లలో నటించానలి ఉంది. ఎవరిదైనా బయోపిక్‌లో నటించాలన్నది నా కోరిక. ఓ వ్యక్తి నిజ జీవిత పాత్రను పోషించడం సవాలుగా ఉంటుంది. అలాంటి సవాలను స్వీకరించడానికి నేను సిద్ధం అని చెప్పింది. కొత్త సినిమాల సంగతేంటి అని అడిగితే.. డిస్కషన్స్‌ నడుస్తున్నాయని, త్వరలో చెబుతాను అని చెప్పింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus