KGF 2 Movie: పుకార్లపై ‘కేజీఎఫ్2’ మేకర్స్ క్లారిటీ!

  • February 28, 2022 / 02:49 PM IST

హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్2’ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. అంటే ఈపాటికే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. కనీసం ఒకట్రెండు పోస్టర్స్ అయినా వదలాలి. కానీ అలా జరగడం లేదు. మేకర్స్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో మరోసారి పుకార్లు ఊపందుకున్నాయి.. ‘కేజీఎఫ్2’ చెప్పిన సమయానికి రాదనే మాటలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ ప్రచారానికి చెక్ పెట్టింది చిత్రబృందం.

పుకార్లు నమ్మొద్దంటూ కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ ప్రకటించారు. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి మాత్రమే వస్తాయని.. ఫేక్ హ్యాండిల్స్ నుంచి వచ్చే అప్డేట్స్ ను నమ్మొద్దని రిక్వెస్ట్ చేశారు. తాజా ప్రకటనతో ‘కేజీఎఫ్2’ సినిమా చెప్పిన సమయానికే వస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ పై కూడా తప్పుడు ప్రచారం జరుగుతుంది. మరో వారం రోజుల్లో ‘కేజీఎఫ్2’ ట్రైలర్ వస్తుందంటూ కొంతమంది ప్రచారం చేశారు.

వీటిని కూడా యూనిట్ ఖండించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . దేశవ్యాప్తంగా హిట్టయిన ‘కేజీఎఫ్’ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 వస్తోంది. మొదటి పార్ట్ లో గోల్డ్ ఫీల్డ్ లో ఉన్న మాఫియా సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు రాకీభాయ్. పార్ట్ 2లో అతడు ఎలా కింగ్ గా మారాడనే విషయాన్ని చూపించబోతున్నారు. హీరోయిజాన్ని ఓ రేంజ్ లో చూపించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus