కే.జి.ఎఫ్ (సిరీస్) కన్నడ రూపు రేఖల్ని మార్చేసిన సినిమా. ఈ సినిమాలో నటించిన నటీనటులు టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. కొంతమంది తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు కీలక పాత్రలు చేసిన నటీనటులు కూడా తెలుగుతో పాటు భాషల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. కే.జి.ఎఫ్ లో హీరోకి ఎక్కువ ఎలివేషన్స్ రావడానికి కారణమైంది మాత్రం కృష్ణ జి రావు అనే చెప్పాలి. ఈయన కే.జి.ఎఫ్ లో తాత పాత్రను పోషించాడు. సినిమా సూపర్ హిట్ అయ్యాక కే.జి.ఎఫ్ తాత గా ఇతను బాగా పాపులర్ అయిపోయాడు .
అంతే కాదు ఇతను ప్రధాన పాత్రలో ఓ సినిమా కూడా రూపొందింది. సరే ఇక అసలు విషయానికి వస్టే.. తాజాగా ఈ నటుడు మృతి చెందాడు. కొంతకాలంగా ఈయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ వస్తున్నాడని తెలుస్తుంది. మెరుగైన చికిత్సకు డబ్బులు కూడా ఇతని వద్ద లేవట. అయినప్పటికీ కొంతమంది సన్నిహితులు ఇతన్ని హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించే ప్రయత్నం చేశారు.
కానీ వయసు 70 ఏళ్ళ పైనే ఉండడంతో ట్రీట్మెంట్ కు ఇతను తట్టుకోలేక ప్రాణం విడిచినట్లు తెలుస్తుంది. ఇతని మరణానికి చింతిస్తూ కొంతమంది నటీనటులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.