KGF2: తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన కేజీఎఫ్2.. కానీ?
April 11, 2022 / 08:09 AM IST
|Follow Us
ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన డీవీవీ దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమాను 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తే ఈ సినిమా ద్వారా ఆయనకు 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన లాభాల్లో రాజమౌళికి కూడా వాటా ఉండటంతో దానయ్యకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. కరోనా వల్ల ఖర్చులు అంచనాలకు మించి పెరగడం వల్ల కూడా ఈ సినిమాకు లాభాలు తగ్గాయని తెలుస్తోంది.
అయితే కేజీఎఫ్2 సినిమా మాత్రం కేవలం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మాత్రమే ఏకంగా 550 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. కేజీఎఫ్2 బడ్జెట్ తో పోల్చి చూస్తే నిర్మాతలకు ఏకంగా మూడు రెట్ల లాభాలను అందించడం గమనార్హం. అయితే కేజీఎఫ్2 సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసినా ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా అనే సందేహాలు నెలకొన్నాయి.
కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాను మించి ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేజీఎఫ్2 భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని యశ్ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత సంచలన రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. యశ్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభపైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది.
గురువారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోనుంది. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ మొదలుకావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.