వంద కోట్ల షేర్ వసూల్ చేసిన ఖైదీ నంబర్ 150 మూవీ

  • January 28, 2017 / 02:23 PM IST

‘ఆట అయినా.. రికార్డ్ ల వేట అయినా…, పోటి అయినా.. కలక్షన్స్ భేటీ అయినా.., ఆయన దిగనంతవరకే అన్నయ్య దిగాక అందరూ ఇంక తమ్ముళ్లే’.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ అభిమాని స్పందన ఇది. చిరు పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ వందకోట్లు షేర్ వసూల్ చేసిందని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ పై మాటను అంగీకరిస్తారు. సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ అయిన మెగాస్టార్ 150 వ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు వంద కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి మెగా పవర్ చూపించింది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపివేసింది. అత్యధిక షేర్ వసూలు చేసిన రెండో తెలుగు చిత్రం గా బాస్ మూవీ నిలిచింది. 311 కోట్ల షేర్ కలక్షన్స్ తో బాహుబలి మొదటి స్థానంలో ఉంది. 85  కోట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్న మహేష్ బాబు శ్రీమంతుడు మూవీని వెనక్కి నెట్టి ఖైదీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అందుకే మెగా ఫ్యాన్స్ తో పాటు, సినీ పండితులు సైతం చిరంజీవి చిరంజీవే అంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus