Ravi Teja: రవితేజ ‘ఖిలాడి’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
February 11, 2022 / 10:20 AM IST
|Follow Us
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కాబోతోంది.
ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 2022 లో ఒక్క ‘బంగార్రాజు’ మినహా చెప్పుకోవడానికి పెద్ద సినిమాలు ఏమీ విడుదల కాలేదు. దాంతో ‘ఖిలాడి’ పై అందరి దృష్టి పడింది. దాంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.
వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
7.00 cr
సీడెడ్
3.60 cr
ఉత్తరాంధ్ర
2.20 cr
ఈస్ట్
1.50 cr
వెస్ట్
1.20 cr
గుంటూరు
1.60 cr
కృష్ణా
1.20 cr
నెల్లూరు
0.80 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
19.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.00 Cr
ఓవర్సీస్
1.20 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
22.30 cr
‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో ఈ చిత్రం భారీగా కలెక్ట్ చేసే అవకాశాలు లేవు. ‘క్రాక్’ తో రవితేజ ఫామ్లో ఉన్నప్పటికీ గతంలో దర్శకుడు రమేష్ వర్మతో ఇతను చేసిన ‘వీర’ మూవీ డిజాస్టర్ అయ్యింది. కాబట్టి ఇది క్రేజీ కాంబో అయితే కాదు.పోటీగా ‘సెహరి’ ‘డిజె టిల్లు’ వంటి సినిమాలు ఉన్నాయి. యూత్ ను ఆకట్టుకునేలా ఆ చిత్రాల ప్రచార చిత్రాలు ఉన్నాయి. వాటి పోటీని తట్టుకుని నిలబడి.. పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే ఈ చిత్రం టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.