Khiladi Movie Review: ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
February 11, 2022 / 06:15 PM IST
|Follow Us
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం “ఖిలాడి”. “వీర” లాంటి డిజాస్టర్ అనంతరం వీళ్ళిద్దరు కలిసి చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలు నమోదయ్యాయి. హీరోయిన్ల గ్లామర్ & ట్రైలర్ జనాలకి బాగా ఎక్కేసింది. మరి సినిమాగా ఖిలాడి ఆ అంచనాలను అందుకోగలిగిందా? “క్రాక్” తర్వాత రవితేజ మరో విజయాన్ని అందుకోగలిగాడా? అనేది చూద్దాం..!!
కథ: మోహన్ గాంధీ (రవితేజ) తన భార్య (డింపుల్ హయాతి)ను చంపిన కేసులో జైల్లో ఉంటాడు. అతడి కంట్రోల్లో 10 వేల కోట్ల రూపాయలు ఉంటాయి. దాంతో చాలామంది పొలిటీషియన్స్ & డీల్ మేకర్స్ మోహన్ గాంధీ వెనుక పడుతుంటారు. ఈ కేసు నుండి అతడ్ని కాపాడాలనుకుంటుంది సైకాలజీ స్టూడెంట్ పూజ (మీనాక్షీ చౌదరి). కట్ చేస్తే.. జైల్ నుంచి బయటకు వచ్చిన మోహన్ గాంధీ అందరికీ పెద్ద షాక్ ఇస్తాడు. ఏమిటా షాక్? అసలు మోహన్ గాంధీ ఎవరు? ఆ 10 వేల కోట్ల సంగతేంటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఖిలాడి” చిత్రం.
నటీనటుల పనితీరు: ఈ తరహా పాత్రలు రవితేజ ఆల్రెడీ ఒక 20 సార్లు చేసేశాడు.. అందువల్ల కొత్త కాస్ట్యూమ్స్ తప్పితే, కొత్త రవితేజను చూడలేము. ఎనర్జీ బాగున్నా.. క్యారెక్టర్ & క్యారెక్టరైజేషన్ ఎప్పటికప్పుడు “కిక్” సినిమాను గుర్తుచేస్తుంటుంది. సి.జి వర్క్ సరిగా లేకపోవడం వలన ఉన్నట్లుండి రవితేజ కాస్త వయసైపోయినట్లు కనిపిస్తాడు. నటుడిగా రవితేజ తన 100% ఎఫర్ట్స్ ఇవ్వలేదనే చెప్పాలి.
అర్జున్ క్యారెక్టర్ కి ఇచ్చిన బిల్డప్ కి, ఆయన క్యారెక్టరైజేషన్ కి సంబంధం ఉండదు. అనసూయ నటిగా అలరించలేకపోయినా గ్లామర్ తో టార్గెట్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇంకా లెక్కకుమిక్కిలి క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ.. ఎవరికీ సరైన జస్టిఫికేషన్ లేకపోవడంతో.. వస్తూ పోతుంటాయి తప్ప పెద్దగా ఇంపాక్ట్ ఉండదు.
సాంకేతికవర్గం పనితీరు: ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ చెప్పినట్లు.. సినిమాలో కంటెంట్ ఏమీ లేదు. కథ ఉంది కానీ కథనం లేదు. ఒకానొక సందర్భంలో ఆ ట్విస్టులేమిటో.. అసలెందుకు వస్తున్నాయో కూడా జనాలకి అర్ధం కాదు. పోలోమని క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎందుకు ఇరికించారో తెలియదు, మనీ లాండరింగ్ అంటారు కానీ.. ఆ ప్రొసెస్ అనేది ఎక్కడా చూపించరు. ఇలా సినిమాలో చెప్పుకుంటూ పోతే అర్ధం కాని విషయాలు చాలా ఉన్నాయి. సొ, దర్శకుడిగా రమేష్ వర్మ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
టెక్నికల్ గా చాలా స్పెషాలిటీస్ ఉన్నప్పటికీ.. ఆ స్పెషాలిటీస్ ను సరిగా వినియోగించుకోలేకపోయాడు రమేష్ వర్మ. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి ఏదో అయ్యింది అనిపించి సర్ధేశాడు. దేవి సంగీతం రెగ్యులర్ గానే ఉన్నా.. నేపధ్య సంగీతం వర్కవుటయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కు దేవి ఇచ్చిన బీజీయమ్ సన్నివేశానికి మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ & ప్రొడక్షన్ డిజైన్ హై రేంజ్ లో ఉన్నాయి.
విశ్లేషణ: రవితేజను సరిగా యూజ్ చేసుకోలేకపోయిన సినిమా ఇది. హెవీ బడ్జెట్, అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసినప్పటికీ.. వాళ్ళ శ్రమ వృధా అయ్యింది. అయితే.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే హీరోయిన్స్ గ్లామర్ డోస్ & కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉండడం సినిమాకి ఉన్న ఓన్లీ ప్లస్ పాయింట్స్. సో, రవితేజ వీరాభిమాని అయ్యుండడమే కాక లాజిక్స్ ను పట్టించుకోని మైండ్ సెట్ & కొంచెం ఓపిక ఉంటే ఈ చిత్రాన్ని ఆనందించగలరు.