ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
August 4, 2022 / 07:29 PM IST
|Follow Us
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది రంభ. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అప్పటి అగ్ర హీరోలతో కలిసి జతకట్టింది. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ అవకాశాలు తగ్గిన తరువాత ఇండస్ట్రీకి దూరమైంది. మధ్యలో ఒకట్రెండు ఐటెం సాంగ్స్ లో మాత్రం కనిపించింది. చాలా ఏళ్లపాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ బ్యూటీ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో చాలా మంది సీనియర్ హీరోయిన్లు జడ్జిలుగా టీవీ షోల్లో కనిపిస్తున్నారు.
కానీ రంభ మాత్రం కంప్లీట్ గా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. తన ఫ్యామిలీతో సమయం గడుపుతోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా ఉందో కొన్ని ఫోటోలు బయటకొచ్చాయి. నటి ఖుష్బూ, రంభ మంచి స్నేహితులు. రీసెంట్ గా ఖుష్బూ.. రంభని కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో, ఆమె పిల్లలతో కలిసి తీసుకున్న ఫొటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ”పాత స్నేహితులను కలుసుకోవడం, వారితో కలిసి టైం స్పెండ్ చేయడం, బిరియానీ తినడం కంటే మంచి ఫీలింగ్ మరొకటి లేదు.
పిల్లల మధ్య బాండింగ్ బలపడినప్పుడు, వాళ్లు కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. చెన్నైలో ఓ సాయంత్రం రంభ ఇంట్లో సరదాగా” అంటూ రాసుకొచ్చారు ఖుష్బూ. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.